`లీడర్`, `మిరపకాయ్`, `మిర్చి` వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. తెలుగులోనే కాదు తమిళంలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది. ఇటీవల వివాహం కూడా చేసుకుంది.
అకస్మాత్తుగా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టడం గురించి రిచా తాజాగా స్పందించింది. `మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలనేది నా చిన్ననాటి కల. ఆ అవకాశం రావడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి అమెరికా వెళ్లిపోయా. సినిమాలు వదిలేసి చదువుకోవడం సరైన నిర్ణయమే అనిపించింది. సినీ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసినందుకు నేనేమీ బాధపడడం లేదు. నా ఎంబీఏ క్లాస్‌మేట్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ప్రస్తుతం జీవితం చాలా సాఫీగా సాగుతోంది. సినిమాలకు దూరమయ్యాననే బాధ లేద`ని రిచా పేర్కొంది.