Richard Branson: పిల్లలకు వీడియో సందేశం

ABN , First Publish Date - 2021-07-12T22:02:33+05:30 IST

అంతరిక్ష యాత్రకు కీలక ముందుడుగు పడింది. వర్జిన్ గెలాక్టిక్స్ వీఎస్ఎస్ యూనిటీ స్పేస్‌షిప్.. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందాన్ని నింగిలోకి మోసుకెళ్లి, క్షేమంగా తిరిగి భూమిపైకి చేరింది. దీంతో స్పేస్ టూరిజా

Richard Branson: పిల్లలకు వీడియో సందేశం

వాషింగ్టన్: అంతరిక్ష యాత్రకు కీలక ముందుడుగు పడింది. వర్జిన్ గెలాక్టిక్స్ వీఎస్ఎస్ యూనిటీ స్పేస్‌షిప్.. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందాన్ని నింగిలోకి మోసుకెళ్లి, క్షేమంగా తిరిగి భూమిపైకి చేరింది. దీంతో స్పేస్ టూరిజానికి నవశకం మొదలైంది. కాగా.. రిచర్డ్ బ్రాన్సన్ తాను, తన బృందం అంతరిక్షంలో పొందిన అనుభవానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు సందేశం ఇచ్చారు. ‘నేను ఒకప్పుడు నక్షత్రాల వైపు చూస్తూ కల కన్న పిల్లవాడిని. ఇప్పుడు అంతరిక్షలో నౌకలో ఉండి, అందమైన మన భూమిని చేస్తున్న పెద్దవాడిని. కలలు కనే భవిష్యత్తు తరాల వారి కోసం మేము దీన్ని చేయగలితే.. మీరేం చేయగలరో ఒక్కసారి ఊహించండి’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రిచర్డ్ బ్రాన్సన్ షేర్ చేసిన వీడియోలో స్పేస్‌ షిప్‌లో ఉన్నవారు భార రహిత స్థితి చేరుకున్న దృశ్యాలను చూడవచ్చు. 


Updated Date - 2021-07-12T22:02:33+05:30 IST