ఘనంగా భోగి

ABN , First Publish Date - 2022-01-15T05:04:00+05:30 IST

పేట జిల్లా వ్యాప్తం గా శుక్రవారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా భోగి
నారాయణపేటలో ముగ్గులు వేస్తున్న మహిళలు


నారాయణపేట, జనవరి 14 : పేట జిల్లా వ్యాప్తం గా శుక్రవారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు ఇంటి ముగింట్లో రంగ వల్లికలను పోటా పోటీగా వేయడం కానవచ్చింది. ముత్తైదువులు వా యినం ఇచ్చి పుచ్చుకున్నారు. మహిళలు, యువతు లు రంగవల్లికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, రేగిపండ్లను ఉంచారు. చిన్నారులు హుషారుగా పతంగులను ఎగురవేశారు. ఐతే జిల్లాలోని కొందరు గురువారం భోగిని జరుపుకోగా, మరికొందరు శుక్రవారం భోగి వేడుకలను జరుపుకున్నారు. సంక్రాంతి మూడ్రోజుల పండుగలో కనుమ పండుగ(కర్రీ) ఆదివారం రావ డంతో కొందరికి కలిసి వస్తుండడం విశేషం. 


 ప్రత్యేక వంటకాలు 

భోగి పర్వదినం దృష్ట్యా పలువురు ప్రత్యేక వంట కాలను తయారుచేస్తున్నారు. నూగులతో తయారు చేసిన సజ్జ రొట్టెలు, పొంగల్‌, అన్ని కూరగాయలను కలగలిపి వండడంతో పాటు, ప్రత్యేక తీపి వంట కాలను తయారుచేసి ఆరగించారు. 



Updated Date - 2022-01-15T05:04:00+05:30 IST