Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా గురుకుంట తిరుణాళ్ల

సింహాద్రిపురం, నవంబరు 29: ప్రతి యేడు కార్తీక మాసం చివరి సోమవారం నిర్వహించే గురుకుంట తిరుణాళ్ల ఘనం గా జరిగింది. సోమవారం ఉదయాన్నే అక్కడ వెలసిన శివునికి, ఆంజనేయస్వామికి వేద పండితులు మంత్రోచ్ఛరనలతో ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. తిరుణాళ్లలో ఏర్పాటు చేసిన గాజులు, చి న్న పిల్లల ఆటవస్తువుల అంగళ్ల వద్ద ప్రజలు రద్దీగా కనిపించారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్పస్వామి మాల ధరించిన వారికి ప్రత్యేక భిక్ష (బోజన వసతి) ఏర్పాటు చేశారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు.


  

Advertisement
Advertisement