Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా కార్తీక వనభోజనాలు


కందుకూరు, నవంబరు 28 :  కందుకూరు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. మన్నేటకోటలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించి వన భోజన కార్యక్రమాననికి సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సంఘం నాయకులు, విశ్వ బ్రాహ్మణ సోదరీసోదరమణులు అధికంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాఆ్లడుతూ..కార్తీక వన భోజనం లాంటి కార్యక్రమ్రాలు స్నేహ సంబంధాల విస్తీరణతోపాటు ఐక్యతను పెంపొందించెందుకు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన భోజన కమిటీ నిర్వాహకులు మాధవరం వెంకటేశ్వర్లు, అరటిపాముల బ్రహ్మయ్య, మదిర చినన్నా, సర్వేపల్లి బ్రహ్మయ్య, లంకెనపల్లి ఓంకారం, అరటిపాముల రమేష్‌, రవి, వెంకటేశ్వర్లు, నరేంద్రతలో పాటు, కందుకూరు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతనిధులు పడకండ్ల ప్రసాదు, కొమ్మెర్ల విజయ్‌, తెరువెళ్లూరి కృషణమాచారి, తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి : బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది మాచవరం సుబ్రమణ్యం పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్ధానంలో ఆదివారం బ్రాహ్మణ కార్తీక వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో బ్రాహ్మణ వైదిక భవన్‌ను నిర్మిస్తానని హమీ ఇచ్చారు. తొలుత బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఏకదాశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఇంటర్‌, 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన బ్రాహ్మణ కుటుంబ సభ్యుల విద్యార్థులను  సన్మానించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం పెద్దలు ధూళిపాళ్ల వీరభద్రయ్య, సత్యగోపాల్‌, మోపాటి విజయ్‌కుమార్‌, పవని నాగరాజు, అగస్థ్యరాజు, హనుమంతరావు, సంఘం కార్యదర్శి ఉమాకాంత్‌, కోశాధికారి మతుకుపల్లి భాస్కర్‌, సీహెచ్‌ సాంబు, చెక్కిలం మురళీ, మనోహర్‌, కె రామశర్మ, రామస్వామి, భాస్కర్‌, సాదు చలపతి, పవని మురళీ, ఆడిటర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement