ఘనంగా నర్సుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-05-13T05:09:01+05:30 IST

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కురుపాం ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సులు ఫ్లోరెన్స్‌ నైటేంగెల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా నర్సుల దినోత్సవం
సీతానగరం : నర్సులకు పువ్వులు అందిస్తున్న దృశ్యం

కురుపాం : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కురుపాం ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సులు ఫ్లోరెన్స్‌ నైటేంగెల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శోభారాణి మాట్లాడుతూ నైటింగేల్‌ స్ఫూర్తితో సేవ చేయాలని పిలుపునిచ్చారు. స్టాఫ్‌ నర్సులు కేక్‌ కట్‌ చేశారు. రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెడ్‌నర్సు ఎస్‌.మణి, స్టాఫ్‌నర్సులు ఎం.సీత, శిల్పా పట్నాయక్‌, విజయ తదితురులు పాల్గొన్నారు.


చీపురుపల్లిలో....

చీపురుపల్లి : కరోనా కష్టకాలంలో  నర్సులు సేవలు  భేష్‌ అని  మానవీయత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ గోవింద రాజులు అన్నారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పనిచేయడం మామూలు విషయం కాదన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్స్‌ చంద్రకళ, ఇన్‌చార్చి సూపరింటెండెంట్‌ రమేష్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి అనంతం తదితరులు పాల్గొన్నారు.


భద్రగిరి సీహెచ్‌సీలో... 

గుమ్మలక్ష్మీపురం : మండలంలోని భద్రగిరి సీహెచ్‌సీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో వైద్యులు ఉదయ్‌కుమార్‌, శోభ, ప్రభు, తేజతో పాటు స్టాఫ్‌నర్సులు, తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


బొబ్బిలిలో...

సీతానగరం(బొబ్బిలి) :  రోగులను బిడ్డల్లా కాపాడే దేవతలు నర్సులని,  వారి సేవలు అమ్మను మరిపిస్తాయని రోటరీ క్లబ్‌ కార్యదర్శి, కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ జేసీ రాజు తెలిపారు. బొబ్బిలిలోని కమ్యూనిటీ హెల్‌ ్త సెంటర్‌లో బొబ్బిలి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నర్సులను సత్కరించారు. అనంతరం వారికి ఎన్‌-95 మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యాధికారులు  శశిభూషణ రావు, రామ్‌ నరేష్‌, శోభారాణి, రోటరీ క్లబ్‌ రీజనల్‌ ఎక్సటెన్షన్‌ చైర్మన్‌ చంద్రకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-05-13T05:09:01+05:30 IST