పెట్టుబడులకు తగిన సమయం

ABN , First Publish Date - 2020-05-24T06:33:19+05:30 IST

కోవిడ్‌-19 ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనవుతోంది. కరో నా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ఉంది. ప్రస్తుత తరుణంలో కూడా మదుపర్లు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు కొనసాగించాలని...

పెట్టుబడులకు తగిన సమయం

  • రిస్క్‌ను బట్టి షేర్ల ఎంపిక
  • కోటక్‌ అసెట్‌ ఎండీ నీలేశ్‌ షా  

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోవిడ్‌-19 ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనవుతోంది. కరో నా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ఉంది. ప్రస్తుత తరుణంలో కూడా మదుపర్లు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు కొనసాగించాలని కోటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. రిస్క్‌ సామర్థ్యాలను బట్టి కొత్త మదుపర్లు పెద్ద, మధ్య, చిన్న కంపెనీల షేర్లలను కొనుగోలు చేయొచ్చని సూచించారు. ప్రస్తుతం ఆమోదయోగ్యమైన స్థాయిలో షేర్ల ధరలు ఉన్నాయని.. వైరస్‌ ప్రభావం తగ్గితే.. స్టాక్‌ మార్కెట్‌ కోలుకోవడమే కాకుండా గత గరిష్ఠ స్థాయిలను అధిగమించగలదని అభిప్రాయపడ్డారు. ‘కోవిడ్‌-19 అనంతరం మదుపర్లలో విశ్వాసాన్ని కల్పించే చర్యలు’ అనే అంశంపై ఎఫ్‌టీసీసీఐ ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘మళ్లీ వృద్ధిరేటు పుంజుకోవాలంటే రుణగ్రహీత చేతుల్లోకి నగదు రావాలి. కరోనాను అధిగమించి.. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే నగదు, ద్రవ్య ఉద్దీపనలను ప్రకటించాలి. సాధారణ ఆలోచన నుంచి బయటపడాలన్నారు.

Updated Date - 2020-05-24T06:33:19+05:30 IST