ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T04:13:18+05:30 IST

ఆదివాసీలు ఐక్యతతో ఉండి హక్కులు సాధించుకోవాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.

ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి
మహగాం రాయిసెంటర్‌ భవనంలో సమస్యలపై చర్చిస్తున్న ఆదివాసీ నాయకులు

సిర్పూర్‌(యూ), అక్టోబరు 17: ఆదివాసీలు ఐక్యతతో ఉండి హక్కులు సాధించుకోవాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.  మండలంలోని మహగాంలో ఆదివారం సిర్పూర్‌(యూ), జైనూర్‌, లింగాపూర్‌ మండలాల ఆదివాసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పటేళ్లు, గ్రామ దేవరిలు, గ్రామ పెద్దల సమావేశం మమగాం రాయిసెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్ళంగా మూడు మండలాల్లో కొనసాగుతున్న మద్యపాన నిషేధంపై చర్చించారు. ఆదివాసీ మహిళా సంఘం సభ్యులు ఏజెన్సీ ప్రాంతం మొత్తం మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు.  ఆదివాసీ చట్టాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయడం లేదని, ఐక్యంగా హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మూడు మం డలాల రాయిసెంటర్ల సార్‌మెడిలు ఆత్రం ఆనందరావు, ఆత్రం మక్తుర్‌సా, జుగంనక దేవరావు, సోయం గంగారాం, మడివి శేశరావు, జైనూర్‌ మర్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంతరావు, నాయకులు ఆత్రం ప్రకాష్‌, ఆత్రం అనిల్‌ కుమార్‌, ఆత్రం రాజేశ్వర్‌, సర్పంచులు ఆత్రం పద్మబాయి, పెందోర్‌ నాగోరావు, ఆత్ర మెంగోరావు, కనక జ్యోతి రాం, మేస్రం భూపతి, సలాం లక్ష్మీబాయిరాజేశ్వర్‌, వీటీడీఏ చైర్మన్‌ కుమ్ర భీంరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:13:18+05:30 IST