ఎస్సీలకు తనఖా భూములపై హక్కులు

ABN , First Publish Date - 2022-01-24T06:08:16+05:30 IST

భూమి కొనుగోలు పథకం కింద 33 సంవ త్సరాలుగా పంపిణీ చేసి ఎస్సీ కార్పొరేషన్‌లో తనఖా ఉంచిన భూములపై సంబంధిత లబ్ధిదారులకు పూర్తిగా హక్కులు కల్పించనున్నట్లు ఎస్సీ కా ర్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్షవర్థన్‌ వెల్లడించారు.

ఎస్సీలకు తనఖా భూములపై హక్కులు

కొనుగోలు పథకం కింద పంపిణీ చేసిన భూములు అప్పగింత 

ఎస్సీ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌ అండ్‌ ఎండీ హర్షవర్థన్‌ వెల్లడి



ఒంగోలు నగరం, జనవరి 23: భూమి కొనుగోలు పథకం కింద 33 సంవ త్సరాలుగా పంపిణీ చేసి ఎస్సీ కార్పొరేషన్‌లో తనఖా ఉంచిన భూములపై సంబంధిత లబ్ధిదారులకు పూర్తిగా హక్కులు కల్పించనున్నట్లు ఎస్సీ కా ర్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్షవర్థన్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన ఒంగోలులో పర్యటించారు. స్థానిక ప్రగతి భవన్‌లోని కా ర్పొరేషన్‌ కార్యాలయాన్ని, రికార్డులను పరిశీలించారు. జిల్లాలో 2008-2009 ఆర్థిక సంవత్సరానికి ముందు ఎస్సీ కార్పొరేషన్‌ రుణంతో కొనుగోలు చేసిన భూములన్నీంటిని పూర్తి హక్కులు లబ్ధిదారులకు కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 3,794 మందికి లబ్ధి కలుగుతుందని ఆయన వెల్లడించారు. 2009లో విడుదలైన జీవో నంబర్‌ 492 మేరకు 2008 వరకు ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రూ.లక్ష రుణాలన్నీ రద్దు అయ్యాయని, దీంతో ఇప్పటి వరకు త మ వద్ద తనఖా ఉన్న లబ్ధిదారులు భూములన్నీ విడిపిస్తామన్నారు. 2008 సంవత్సరం తర్వాత కొనుగోలు చేసిన భూములపై కూడా పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపుతామని ఆయన తె లిపారు.  కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, జేసీ కృష్టవేణి, ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర అఽధికారి మధుసూదనరావు, జిల్లా ఈడీ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T06:08:16+05:30 IST