న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన విభాగం ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాన్ని ప్రత్యేక కొత్త యూనిట్‌గా విభజించే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసింది. కంపెనీ వృద్ధికి ఊతమిచ్చేందుకుగానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ఈ మేరకు అడుగు లు వేస్తున్నట్లు చెబుతున్నారు. రిలయ న్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ అసెట్స్, రిటైల్ ఫ్యూయల్ వ్యాపారాలు... ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) సారధ్యం లో కొనసా గుతున్నాయి. అయితే... కేజీ-డీ6, టెక్స్టైల్స్ వంటి ప్రధాన వ్యాపారాలు ఓ2సీ పరిధిలోకి రావడం లేదు. కాగా ఇటివలే వెలువడిన క్యూ3లో ఫలితాల్లో తొలిసారి ఓ2సీ వ్యాపారానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఫలితాల్లో కంపెనీ వెల్లడించిం ది. గతంలో రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార వివరాలను ప్రత్యేకంగా... ఇంధన రిటైల్ ఆదాయాన్ని కంపెనీ రిటైల్ వ్యాపారంలో భాగంగా చూపిస్తూ వచ్చింది. కాగా... ఈసారి మాత్రం... రెంటినీ కలిపి ఒకటిగానే చూపించింది. రిఫైనింగ్, పెట్రోకె మికల్స్తోపాటు ఫ్యూయెల్ రిటైలింగ్ వ్యాపార లాభాలను ఉమ్మడిగా వెల్లడించినట్లు అక్టో బరు–డిసెంబరుత్రైమాసిక ఫలితాల్లో వెల్లడిలో కంపెనీ తెలిపింది.