వైద్య సేవలు భేష్‌ నిర్వహణ తుస్‌

ABN , First Publish Date - 2020-08-12T11:25:50+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కోరలుచాస్తోంది. వైరస్‌ బారినపడిన బాధితులు పదివేలు దాటారు.

వైద్య సేవలు భేష్‌  నిర్వహణ తుస్‌

రిమ్స్‌లో వరుస ఘటనలు 8 వెంటాడుతున్న సమస్యలు

పర్యవేక్షణ  వదిలేసిన అధికారులు 8 బాధితుల ఇక్కట్లు 


ఒంగోలు (కార్పొరేషన్‌) ఆగస్టు 11: జిల్లాలో కొవిడ్‌ కోరలుచాస్తోంది. వైరస్‌ బారినపడిన బాధితులు పదివేలు దాటారు. పాజిటివ్‌ అనగానే కొవిడ్‌ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.  వారంతా ఒంగోలు రిమ్స్‌లో చేరాలని కోరుకుంటున్నారు. రిమ్స్‌లో బెడ్‌ దొరికితే చాలు.. బతికి బయటపడినట్టే అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులను సైతం కాదని ప్ర భుత్వ జనరల్‌ ఆసుపత్రి వైపే మొగ్గుచూపుతున్న పాజిటివ్‌ బాధితులు వేలల్లోనే ఉన్నారు. కరోనా బాధితుల పట్ల అక్కడి వైద్యులు చూపిస్తున్న శ్రద్ధ, చేస్తున్న సేవలను శభాష్‌ అంటున్నారు. అయితే పర్యవేక్షణపై పెదవి విరుస్తున్నారు. 


వరుస ఘటనలు.. వెంటాడుతున్న సమస్యలు 

రిమ్స్‌లో ఇటీవల కాలంలో వరుస ఘటనలు, వెంటాడుతున్న సమస్య లు అక్కడ పర్యవేక్షణలోపాన్ని తెలియజేస్తున్నారు. మొదట్లో సరైన మె నూ అమలుకాక బాధితులు ఆకలికేకలు పెట్టిన విషయం తెలిసిందే  అలాగే వందల సంఖ్యలో రోగులు.. వారికి వైద్యం అందించేందుకు ఉప యోగించినటన్నుల కొద్దీ బయోవేస్ట్‌ ఆసుపత్రి ప్రాంగణంలోనే నిర్లక్ష్యం గా పడవేయడంపై విమర్శలు  వచ్చాయి. మరోవైపు ఇటీవల వెలుగు చూస్తున్న వరుస మరణాలకూ సౌకర్యాల కొరతే కారణమని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేవని, తాను చనిపోవడం ఖా యమని కరోనా బారిన పడిన ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆందోళన చెం దుతూ వాట్సాప్‌ చాటింగ్‌ చేసి మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే పదిహేను రోజుల క్రితం కురిచేడుకు చెందిన వ్యక్తి మృతిచెందినా కుటుం బసభ్యులకు తెలియజేయలేదు. రెండు రోజుల క్రితం మార్కాపురం మం డలానికి చెందిన ఓ యువకుడు పాజిటివ్‌తో బాధపడుతూ వైద్యం పొం దుతూ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరానికి గురిచేసింది.


తాజాగా కె. బిట్రగుంటకు చెందిన వీఆర్‌ఏ కాం తారావు (60)కు పాజిటివ్‌ అనితేలడంతో ఈనెల 5న 108లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఆకలితో రెండురోజుల క్రితమే అతను మృతిచెందాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కుక్కలు చెవులు, ముక్కు పీక్కు తినడం వంటి ఘటనలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం రిమ్స్‌లో పాజిటివ్‌తో బాధపడుతున్న వారికి కేటాయించిన వార్డులో నీటి వసతి లేకపోవడంతో నానా అవస్థలు పడినట్లు బాధితులు వాపోయారు. మరుదొడ్లు సైతం కంపు కొడుతున్నా యని, నీటి సమస్య వేధిస్తుందని అక్కడి బాధితులు వివరిస్తున్నారు.  


పట్టించుకుంటే పరిష్కారం సులువు 

కరోనాతో రోజురోజుకు రిమ్స్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుంది. వైద్యం బాగుండటంతో అత్యధిక శాతం మంది రిమ్స్‌లో బెడ్‌ కోసం సిఫా ర్సులు చేయించుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే రిమ్స్‌ లో సమస్యలు వేధిస్తున్నాయని బాధితులు వెల్లడిస్తున్నారు. పెరుగు తున్న బాధితులను దృష్టిలో ఉంచుకుని, అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది, నర్సింగ్‌ సిబ్బంది, బెడ్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత, ఐసీయూ లో వెంటిలేటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై పాలకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకా కుండా ఆసుపత్రిలో జరుగుతున్న వరుస ఘటనలపై పర్యవేక్షణాధికారు లు  దృష్టిసారిస్తే భవిష్యత్‌లో పునరావృతం కాకుండా నివారించవచ్చు. 

Updated Date - 2020-08-12T11:25:50+05:30 IST