పాలకులకు పట్టని రిమ్స్‌ సమస్యలు

ABN , First Publish Date - 2021-04-19T05:38:14+05:30 IST

జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌ పేరుకే పెద్దాసుపత్రిగా ఉందని రోగులకు సరైన వైద్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ ఆరోపిం చారు.

పాలకులకు పట్టని రిమ్స్‌ సమస్యలు

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 18: జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌ పేరుకే పెద్దాసుపత్రిగా ఉందని రోగులకు సరైన వైద్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ ఆరోపిం చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిమ్స్‌కు వెళ్లే రోగి తీవ్ర అనారోగ్యానికి గురైతే ఇక్కడి వైద్యులు హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారని ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత వల్ల రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రిమ్స్‌ పక్కన ఉన్న ఔషధ సెంటర్లలో 300 సిలెండర్లు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే తాను స్వయంగా డబ్బులు ఖర్చు చేసి సిలిండర్‌లో ఆక్సిజన్‌ నింపి రోగులకు అందేలా చూస్తానని చెప్పారు. పవిత్ర రంజాన్‌లో పెద్దలు, జెకాస్‌లకు, ఇఫ్తార్‌ విందులకు ఖర్చు చేసే డబ్బులు రిమ్స్‌లో పేదల కోసం, ఆక్సిజన్‌ సిలిండర్లు, విల్‌చైర్ల  కోసం ఖర్చు చేయాలని ఆయన కోరారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మునిగెల నర్సింగ్‌, మోతిరాం, రాహుల్‌, చంద్రా, రాజుయాదవ్‌, జాకీర్‌, ముదస్‌సిర్‌నగర్‌ తదితరులున్నారు.  

Updated Date - 2021-04-19T05:38:14+05:30 IST