పీఎంజీఎ్‌సవై టెండర్లలో రింగ్‌

ABN , First Publish Date - 2021-11-09T06:50:01+05:30 IST

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎ్‌సవై) పనుల్లో అధికార పార్టీ నేతలు, అధికారులు, ఓ బడా కాంట్రాక్టర్‌ మిలాఖాతయినట్టు సమాచారం. ఆ ఒక్కడే పను లు దక్కించుకునేలా చక్రం తిప్పినట్లు తెలిసింది.

పీఎంజీఎ్‌సవై టెండర్లలో రింగ్‌

రూ.40కోట్ల పనులు అయినవారికి అప్పగించే యత్నం

అధికార పార్టీ నేతల అండదండలు


నల్లగొండ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎ్‌సవై) పనుల్లో అధికార పార్టీ నేతలు, అధికారులు, ఓ బడా కాంట్రాక్టర్‌ మిలాఖాతయినట్టు సమాచారం. ఆ ఒక్కడే పను లు దక్కించుకునేలా చక్రం తిప్పినట్లు తెలిసింది. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా నాగార్జునసాగర్‌, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలో రహదారు ల నిర్మాణానికి రూ.40కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన పనుల ను అనుకూలుడైన కాంట్రాక్టర్‌కు దక్కేలా అధికారులు, అధికారపార్టీ నేతలు సహకరించారని తోటి కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. 


ఇలా చక్రం తిప్పారు.

పీఎంజీఎ్‌సవై పనుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ధరకు మించి అత్యధికంగా కోట్‌ చేస్తే టెండర్‌ రద్దవుతుంది. దీంతో తొలిసారి టెండర్‌ పిలిచినప్పుడు ఎవ్వరూ పోటీపడలేదని అధికారులు చూపించారు. ఫలితంగా రెండోసారి టెండర్‌ను 5శాతం పెంచి పిలిచే అవకాశం ఏర్పడింది. ఇక ఈ టెండర్‌కు ఎవ్వరూ పోటీకి రావొద్దని అధికారులు పథకం పన్నారు. పనులు దక్కాలంటే 70కిలోమీటర్ల దూరం లోపల హాట్‌మిక్స్‌ప్లాంట్‌ ఉన్న వారే అర్హులు అనే నిబంధన ఉంది. అయితే హాట్‌మిక్స్‌ప్లాంట్‌ 70కిలోమీటర్ల లోపల ఉందనే సర్టిఫికెట్‌ మిగిలిన కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా అధికార పార్టీ కీలకనేతలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అనుకున్న వ్యక్తికే పెద్ద కాంట్రాక్ట్‌ దక్కేలా అంతా కుమ్మక్కయ్యారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. ప్రైస్‌బిడ్‌లోనే ఎవరు పోటీ పడ్డారో చూడటం, టెక్నికల్‌ బిడ్‌లో వారు లేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారని, టెక్నికల్‌ బిడ్‌లో ఉన్న వారిని తిరస్కరించేందుకు పలు రకాల సాకులు వెతుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నింటినీ తట్టుకొని టెక్నికల్‌ బిడ్‌లో నిలబడితే వెనక్కి తగ్గాల్సిందిగా అధికారులు చెబుతున్నారని, వినకపోతే అధికారపార్టీ నేతలతో ఫోన్లలో బెదిరింపులకు దిగుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అన్ని టెండర్లలో ఇదే తంతు సాగుతోందని వారు వాపోతున్నారు. కాగా, రూ.40కోట్ల పనుల్లో రింగయ్యారనే ఆరోపణలపై పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ప్రకాశ్‌ను వివరణ కోరగా ‘ఇంకా ఈ ప్రక్రియ ప్రాసె్‌సలోనే ఉంది. రింగ్‌ అయ్యారని ఎలా చెప్పగలుగుతాం’ అని సమాధానమిచ్చారు.

Updated Date - 2021-11-09T06:50:01+05:30 IST