రిషబ్ రివర్స్ స్కూప్.. వైరల్ అవుతున్న వీడియో

ABN , First Publish Date - 2021-03-06T23:56:18+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ ఎంతో..

రిషబ్ రివర్స్ స్కూప్.. వైరల్ అవుతున్న వీడియో

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ ఎంతో కీలకం. ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆట ఆడుకుని అద్భుతంగా మెరిశాడు. ఈ నేపథ్యంలో పంత్ కొట్టిన ఓ బౌండరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌ షాట్‌తో స్కేర్ ఫీల్డర్ తలమీదుగా కొట్టిన ఈ బౌండరీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పంత్ కొట్టిన బౌండరీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేస్తున్న అభిమానులు ‘కొత్త బంతితో.. అది కూడా ఆండర్సన్ లాంటి సీనియర్ బౌలర్ బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ ఆడిన బ్యాట్స్‌మన్ ఇంకెవరైనా ఉన్నారా..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


కాగా.. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అటు బ్యాటింగ్‌తోనే కాకుండా.. వికెట్ కీపింగ్‌లో కూడా ఔరా అనిపించాడు. ఓలీ పోప్‌ను క్షణాల్లో స్టంప్ అవుట్ చేశాడు. అలాగే డామ్ బెస్ ఇచ్చిన లో క్యాచ్‌ను చాకచక్యంగా అందుకున్నాడు. ఇక ధోనీ స్టైల్లో వికెట్లను చూడకుండా బంతిని విసిరిన విధానం అతడు తన కీపింగ్‌ను ఏ స్థాయిలో మెరుగుపరుచుకున్నాడో చెప్పడానికి ఓ చిన్న రుజువుగా పేర్కొనవచ్చు.



Updated Date - 2021-03-06T23:56:18+05:30 IST