మైదానంలో పంత్‌ పాట

ABN , First Publish Date - 2021-01-19T06:27:59+05:30 IST

వికెట్ల వెనకాల రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ నైపుణ్యం ఎలా ఉన్నా ఆసీస్‌ ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాల్లో మాత్రం బిజీగా ఉంటుంటాడు...

మైదానంలో పంత్‌ పాట

వికెట్ల వెనకాల రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ నైపుణ్యం ఎలా ఉన్నా ఆసీస్‌ ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాల్లో మాత్రం బిజీగా ఉంటుంటాడు. అలాగే నాలుగో రోజు ఆటలో పాటతోనూ ఆకట్టుకున్నాడు. గ్రీన్‌, పెయిన్‌ జోడీని విడదీసేందుకు స్పిన్‌తో ఉచ్చు బిగించాల్సిందిగా వాషింగ్టన్‌ సుందర్‌కు పంత్‌ సలహా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ‘స్పైడర్‌మ్యాన్‌, స్పైడర్‌మ్యాన్‌’ అంటూ పాట రూపంలో చెప్పాడు. ఇది స్టంప్‌ మైక్‌ ద్వారా వినిపించడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-01-19T06:27:59+05:30 IST