Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీమిండియాకు షాక్.. రిషభ్ పంత్‌కు కరోనా!

లండన్: ఓ భారత ఆటగాడు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు షాక్ తగిలింది. అయితే, కరోనా సోకింది యువ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రిషబ్‌ను మిగతా జట్టు సభ్యులకు దూరంగా క్వారంటైన్‌లో ఉంచారు. కాగా, రిషభ్‌కు పాజిటివ్‌గా తేలి ఎనిమిది రోజులు అవుతున్నట్లు సమాచారం. దీంతో పదో రోజు(ఈ నెల 18న) అతడికి మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టెస్టులో నెగెటివ్ వస్తే రిషభ్ తిరిగి భారత జట్టుతో కలుస్తాడని బోర్డు పేర్కొంది. కాగా, ఇంగ్లాండ్‌తో టెస్టు సీరిస్‌కు ముందు 40 రోజుల వ్యవధి ఉండడంతో ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.

దాంతో భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ వీధుల్లో విహారించారు. వీరిలో కొందరు వింబుల్డన్, యూరో కప్ మ్యాచులకు కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రిషభ్‌ పంత్‌ కూడా ఆ సమయంలో యూరోకప్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్‌ లేకుండానే ప్రేక్షకుల మధ్య కూర్చొని ఫొటోలు దిగాడు. దాంతో అక్కడే అతడికి వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. తాజాగా విశ్రాంతి గడువు ముగియడంతో తిరిగి బయోబబుల్‌లో వెళ్లేముందు ఆటగాళ్లకు కరోనా పరీక్ష చేశారు. ఇందులో రిషభ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడికి డెల్టా వేరియంట్ సోకినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రిషభ్‌ను మిగతా సభ్యులకు దూరంగా క్వారంటైన్ చేశారు. పదో రోజు అంటే ఈ నెల 18న మరోసారి కరోనా పరీక్ష నిర్వహించనున్నారు. దీంట్లో నెగెటివ్ వస్తే రిషభ్ తిరిగి టెస్టు స్క్వాడ్‌తో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement