ఆర్టీపీపీలో పెరుగుతున్న బొగ్గు నిల్వలు

ABN , First Publish Date - 2021-05-10T04:58:18+05:30 IST

ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు 50వేల మెట్రిక్‌టన్నులకు చేరుకున్నట్లు సీఈ మోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీపీపీలో పెరుగుతున్న బొగ్గు నిల్వలు

 ఏపీ ఎస్‌ఎల్‌డీసీ ఆదేశాల మేరకు ఉత్పత్తి: సీఈ 

ఎర్రగుంట్ల, మే 9: ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు 50వేల మెట్రిక్‌టన్నులకు చేరుకున్నట్లు సీఈ మోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీపీపీలోని 210 మెగావాట్ల సామర్థ్యం గల 5యూనిట్లు, 600మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్‌ మొత్తం 1650మెగావాట్ల సామర్థ్యం గల ఆరు ప్లాంట్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిగా నిలిపివేసి స్టాండ్‌బైగా ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ విషమ పరిస్థితిలో డిమాండ్‌ లేకపోవడం వల్ల ఉత్పత్తికి డిమాండ్‌ లేదని ఏపీఎ్‌సఎల్‌డీసీ ఆదేశాల మేరకు ఎప్పుడు ఉత్పత్తిని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీపీపీకి సంబంధించి 90వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు క్రిష్ణపట్నం రేవులో ఉన్నట్లు తెలిపారు.  రోజూ 4రేక్స్‌ సింగరేణి నుంచి క్రిష్ణపట్నం ఆర్టీపీపీకి వస్తున్నట్లు తెలిపారు. బొగ్గు కొరత వల్ల ఆపలేదని, ఏపీఎ్‌సఎల్‌డీసీ ఆదేశాల మేరకు ఆపామన్నారు. ఎప్పుడు అనుమతి వచ్చినా యూనిట్లను రన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఆర్టీపీపీలో ఆస్పత్రిని ఏర్పాటు చేయండి

విజృంభిస్తున్న కరోనా నుంచి రక్షించుకునేందుకు ఆర్టీపీపీలో ఆక్సిజన్‌ వెంటిలేషన్‌తో కూడిన కొవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పీపీ ఎలక్ర్టిసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కాంట్రాక్ట్‌ వర్క ర్స్‌ విభాగం రీజినల్‌ సెక్రటరీ వి.సాంబశివారెడ్డి కలెక్టర్‌ను, వైద్యశాఖను, ఏపీ జెన్‌కో యాజమాన్యాన్ని కోరారు. 

Updated Date - 2021-05-10T04:58:18+05:30 IST