అధికమవుతున్న కబ్జాలు : సీపీఎం

ABN , First Publish Date - 2021-10-17T05:41:12+05:30 IST

వైసీపీ నాయకుల కబ్జాలు అధికమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కమీటీ సభ్యుడు నారాయణ, అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ సీఆర్‌వీ ప్రసాద్‌ , కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సాత్తార్‌ జకరయ్య, సీపీఐ జిల్లా నాయకులు బాదుల్లా, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు దేవరకృష్ణ ధ్వజమెత్తారు.

అధికమవుతున్న కబ్జాలు : సీపీఎం

కడప(రవీంద్రనగర్‌), అక్టోబరు 16 : వైసీపీ నాయకుల కబ్జాలు అధికమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కమీటీ సభ్యుడు నారాయణ, అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ సీఆర్‌వీ ప్రసాద్‌ , కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సాత్తార్‌ జకరయ్య, సీపీఐ జిల్లా నాయకులు బాదుల్లా, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు దేవరకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక చిన్నచౌకు పంచాయతీలో కబ్జాకు గురైన స్థలాన్ని అఖిల పక్షం కమిటీ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కడప నగరం చిన్నచౌకు పంచాయతీలో సర్వే నెం.363/1 , 365/2, 368లో పది ప్రైవేటు ప్లాట్లు రాజరాజేశ్వరి కళ్యాణ మండపం కొంత భాగం, భవానీ నగర్‌కు వెళ్లే రోడ్డును 73 సెంట్ల స్థలాన్ని కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారన్నారు. 1970వ సంవత్సరం నుండి భవానీ నగర్‌లో దాదాపు 80 గిరిజ న కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ కుటుంబాలకు దారే లే కుండా మొత్తం భూమిని కబ్జా చేశారన్నారు. దారి లేక ఎటువెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో స్థానికులు ఉన్నారన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి హక్కుదారులకు ఆ స్థలాన్ని ఇవ్వాలని లేనిపక్షంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2021-10-17T05:41:12+05:30 IST