హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనుల్లో ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-04T05:55:13+05:30 IST

హెచ్‌పీసీఎల్‌ విస్తరణలో భాగంగా చేపట్టిన పంప్‌హౌస్‌ పనుల్లో గురువారం సాయంత్రం ఊహించని విధంగా ప్రమాదం చోటుచేసుకుంది.

హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనుల్లో ప్రమాదం
రమేష్‌ కుమార్‌ (ఫైల్‌ పోటో)

మట్టిలో కూరుకుపోయి కాంట్రాక్టు కార్మికుడి మృతి

మరో ఇద్దరికి స్వల్ప గాయాలు


మల్కాపురం, డిసెంబరు 3: హెచ్‌పీసీఎల్‌ విస్తరణలో భాగంగా చేపట్టిన పంప్‌హౌస్‌ పనుల్లో గురువారం సాయంత్రం ఊహించని విధంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు కార్మికుడు మట్టిలో కూరుకుపోయి మృతిచెందగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సింథియా సమీపంలోని పైప్‌లైన్‌ జంక్షన్‌ వద్ద హెచ్‌పీసీఎల్‌కు పంప్‌హౌస్‌ ఉంది. ఇది సముద్రం ఒడ్డునే ఉంటుంది. పంప్‌హౌస్‌ అడుగు భాగాన బిహార్‌కు చెందిన రమేశ్‌కుమార్‌ (33) సహా ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు గురువారం ఉదయం నుంచి పనిచేస్తు న్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం గోడలు బీటలు వారడంతో కూలిపోతాయే మోననే భయంతో అంతా బయటకు రావడానికి యత్నించారు. అయితే రమేశ్‌కుమార్‌ మట్టిలో కూరుకుపోయాడు. మిగతా నలుగురు బయట పడ్డారు. వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రమేశ్‌ కుమార్‌ మృతదేహాన్ని వెలికితీయడానికి పోలీసులు ప్రయత్ని స్తున్నారు. మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐ సురేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

Updated Date - 2020-12-04T05:55:13+05:30 IST