ఒకే దేశంపై ఆధారపడితే ఎంత ప్రమాదమో కోవిడ్ చూపించింది : మోదీ

ABN , First Publish Date - 2020-09-29T00:14:48+05:30 IST

ఇండియా- డెన్మార్క్ వర్చువల్ సమ్మిట్ సోమవారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని

ఒకే దేశంపై ఆధారపడితే ఎంత ప్రమాదమో కోవిడ్ చూపించింది : మోదీ

న్యూఢిల్లీ : ఇండియా- డెన్మార్క్ వర్చువల్ సమ్మిట్ సోమవారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్‌రిక్సెన్ పాల్గొన్నారు. ఈ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా చైనాపై విరుచుకుపడ్డారు. ఉత్పత్తుల విషయంలో ప్రపంచం మొత్తం ఒకే దేశంపై ఆధారపడితే ఎంత ప్రమాదమో కోవిడ్ చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం తాము జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఉత్పత్తుల విషయంలో ముందుకు సాగుతున్నామని, ఆసక్తి ఉన్న ప్రపంచ దేశాలు తమతో కలిసి రావొచ్చని మోదీ పిలుపునిచ్చారు.


భారత్, చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉన్న సందర్భంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్‌రిక్సెన్ పెళ్లిరోజును పురస్కరించుకొని ప్రధాని శుభాంకాంక్షలు తెలిపారు. ఇందుకు ప్రతిగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు భారత్‌ను మరోసారి సందర్శించాలన్న ఉత్సుకతతో ఉందని ఆమె మోదీ దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డ తరువాత భారత్‌కు తప్పక ఆహ్వానిస్తామని మోదీ ప్రకటించారు. 

Updated Date - 2020-09-29T00:14:48+05:30 IST