Abn logo
Jun 11 2021 @ 15:02PM

నాతో రీటా బహుగుణ మాట్లాడలేదు : సచిన్ పైలట్

జైపూర్ : ఉత్తర ప్రదేశ్ బీజేపీ నేత రీటా బహుగుణ జోషీ తనతో మాట్లాడలేదని రాజస్థాన్ కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడానికి అంగీకరించినట్లు ఆమె చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు. 


‘‘తాను సచిన్‌తో మాట్లాడానని రీటా బహుగుణ జోషీ చెప్తున్నారు. ఆమె బహుశా సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడారేమో. నాతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు.’’ అని సచిన్ పైలట్ అన్నారు. 


సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారని, బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద ఇటీవల బీజేపీలో చేరడంతో సచిన్ కూడా ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 


రీటా బహుగుణ గురువారం ఓ హిందీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ, సచిన్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతారని చెప్పారు. కాంగ్రెస్ ఆయనను చులకనగా చూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ శుక్రవారం వివరణ ఇచ్చారు. తాను బీజేపీలో చేరబోనని చెప్పారు. రీటా బహుగుణ బహుశా సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడి ఉంటారన్నారు. 


Advertisement
Advertisement
Advertisement