May 18 2021 @ 06:24AM

బామ్మ‌గారిపై మ‌న‌సు పారేసుకున్న జెనీలియా భ‌ర్త‌... కార‌ణ‌మిదే!

ముంబై: ప్ర‌తిభావంతులైన వ్యక్తుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇదేకోవ‌లో తాజాగా ఒక వృద్ధురాలు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఆమె ప్ర‌తిభ చూసిన‌వారంతా శ‌భాష్ అనకుండా ఉండ‌లేక‌పోతున్నారు. బాలీవుడ్ నటులు కూడా ఈ వృద్ధురాలికి అభిమానులుగా మారిపోయారు. చీర క‌ట్టుకుని, షూస్ ధ‌రించిన ఈ వృద్ధురాలు సూప‌ర్ బౌలింగ్ చేశారు. 

ఆటగాళ్లు సైతం ఆమె బౌలింగ్ చూసి వారేవా అంటున్నారు.  బొమ్మ‌రిల్లు సినిమా హీరోయిన్ జెనీలియా భ‌ర్త‌, న‌టుడు రితేష్ దేశ్ ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వృద్ధ మ‌హిళ‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు.... చీర క‌ట్టుకుని బౌలింగ్ చేసిన ఈ బామ్మ‌గారిని పొగ‌డండి. ఆమె మాస్క్ కూడా వేసుకున్నారు. అంటూ కామెంట్ రాశారు. ఈ వీడియోను చూసిన పలువురు బామ్మగారి ప్ర‌తిభ‌ను పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. 

                                      Viral Internet Videos సౌజ‌న్యంతో...