Abn logo
Mar 9 2021 @ 08:01AM

భార్యా పిల్లలపై కోపంతో కాల్పులు జరిపిన రియల్టర్‌

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట : భార్యా పిల్లలపై కోపంతో లైసెన్స్‌డ్‌ తుపాకీతో ఇంట్లో గోడపై కాల్పులు జరిపి వీరంగం సృష్టించాడు ఓ రియల్టర్‌. పాతబస్తీ బిలాల్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ హబీబ్‌ హష్మీ(52) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. సోమవారం అతడి భార్య కుమారులకు వివాహాలు చేద్దామని ఒత్తిడి చేసింది. తన కుమారులు ప్రయోజకులు కానిదే వివాహాలు చేయనని సయ్యద్‌ హబీబ్‌ హష్మీ చెప్పాడు. ఇంటికి సంబంధించిన పేపర్లు ఇవ్వమని కుమారులు, భార్య ఒత్తిడి చేయడంతో తన వద్ద ఉన్న రివాల్వర్‌తో ఇంట్లో గోడపైకి మూడు రౌండ్‌ల కాల్పులు జరిపాడు. సమాచారమందిన కాలాపత్తర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడిని అదుపులోకి తీసుకుని, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సయ్యద్‌ హబీబ్‌ హష్మీ వద్ద 20ఏళ్లుగా గన్‌ లైసెన్స్‌ ఉందని తేలింది. హష్మీని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement