‘ఆత్మవిశ్వాసం, మనోబలంతో భారత పునరుజ్జీవనం’ - ఆర్కే మఠ్ వెబినార్

ABN , First Publish Date - 2020-11-20T23:13:41+05:30 IST

యువతలో దేశాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో రామకృష్ణ మఠం ఎప్పుడూ ముందుంటుంది. ఆధునికతతో పాటు ప్రాచీన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను మేళవించి... తనదైన శైలిలో బోధిస్తోంది. ఎప్పటికప్పుడు చర్చా గోష్ఠులు నిర్వహిస్తూ..

‘ఆత్మవిశ్వాసం, మనోబలంతో భారత పునరుజ్జీవనం’ - ఆర్కే మఠ్ వెబినార్

యువతలో దేశాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో రామకృష్ణ మఠం ఎప్పుడూ ముందుంటుంది. ఆధునికతతో పాటు ప్రాచీన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను మేళవించి... తనదైన శైలిలో బోధిస్తోంది. ఎప్పటికప్పుడు చర్చా గోష్ఠులు నిర్వహిస్తూ.. చక్కని భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకమైన బాటను వేస్తోంది. తాజాగా ఆత్మవిశ్వాసం, మనోబలంతో భారత పునర్నిర్మాణం అనే అంశంపై వెబినార్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రామకృష్ణ మఠ్‌కు చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద నేతృత్వంలో జరిగే ఈ వెబినార్‌ నవంబర్ 22న ఉదయం 11.00 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్వతారోహకురాలు అరుణిమా సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూమ్, యూట్యూబ్ ద్వారా వెబినార్‌లో పాల్గొనవచ్చు.  


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


రామకృష్ణ మఠం పని వేళలు: ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-11-20T23:13:41+05:30 IST