ఆ గ్రామానికి రహదారేది....!

ABN , First Publish Date - 2020-12-03T04:54:02+05:30 IST

మండల కేంద్రానికి ఐదు కి.మీ దూరం, పంచాయతీ కేంద్రానికి ఒకటిన్నర కి.మీ దూరం. అయినా ఆగ్రామానికి రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆ గ్రామానికి రహదారేది....!
బురదమయమైన గ్రామానికి వెళ్లే రహదారి

కలసపాడు, డి సెంబరు 2 : మండల కేంద్రానికి ఐదు కి.మీ దూరం, పంచాయతీ కేంద్రానికి ఒకటిన్నర కి.మీ దూరం. అయినా ఆగ్రామానికి రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లె పంచాయతీలోని నల్లగుండుపల్లెలో వంద కుటుంబాలు నివశిస్తున్నాయి. ఈ గ్రామానికి మండల కేంద్రం నుంచి కానీ, పంచాయతీ కేంద్రమైన లింగారెడ్డిపల్లె నుంచి కానీ సరైన రహదారి లేదు. కేవ లం బండ్ల బాట మాత్రమే ఉంది. అది కూడా ఐదు నెలల క్రితం రహదారి వేస్తున్నామని ఓ కంపెనీ రోడ్డు వెడల్పు చేసింది. అయితే స్థానికంగా కొందరు నాయకులు ఆ పనులు ఆపడంతో ఉన్న కాస్త రహదారి ఇటీవల కురిసిన వర్షాలతో అధ్వానంగా తయారైంది. మోకాటిలోతు గుంతలు ఏర్పడి బయటికి వచ్చేందుకు కూడా దారి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక వర్షం పడిందంటే పదిరోజుల పాటు బయటికి వెళ్లలేని దుస్థితి. ద్విచక్ర వాహనాలకు కానీ, ఆటోలు కానీ ఆ దారిపై వెళ్లాలంటే నరకయాతనే. అధికారులు తక్షణం స్పందించి గ్రామానికి వెంటనే రహదారిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-03T04:54:02+05:30 IST