కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-01-18T04:52:37+05:30 IST

కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రా మానికి చెందిన కారు డ్రైవర్‌ మసరం బాల రాజు(30) అక్కడికక్కడే మృతి చెందగా మరో నలు గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివా రం తెల్లవారుజామున మండలంలోని వినోభానగర్‌ గ్రామ సమీపంలో జరిగింది.

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కారు డ్రైవర్‌ దుర్మరణం.. మరో నలుగురికి తీవ్ర గాయాలు 

జూలూరుపాడు, జనవరి17: కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రా మానికి చెందిన కారు డ్రైవర్‌ మసరం బాల రాజు(30) అక్కడికక్కడే మృతి చెందగా మరో నలు గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివా రం తెల్లవారుజామున మండలంలోని వినోభానగర్‌ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్లుకు చెందిన రావిరాల వెంకటేశ్వర్లు తండ్రీ ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో భద్రాచలంలో తండ్రికి 6వ నెల మాసికం పెట్టి దైవదర్శనం చేసుకునేందుకు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, బందువులు కలిసి నకిరేకల్లు నుంచి భద్రాచలానికి వెళ్లేందుకు శనివారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో జూలూరుపాడు మండలం వినోభానగర్‌ గ్రామ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు కొత్తగూడెం నుంచి హైదారాబాద్‌కు వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్‌ బాలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న రావిరాల వెంకటేశ్వర్లుతో పాటు, అతని బావలు డోర్నాల సురేందర్‌, నర్సయ్యలతో పాటు, సోదరి అండాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు నలు గురిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యుల సూచనల మేరకు ఖమ్మం నుంచి హైదారాబాద్‌కు తీసుకెళ్ళారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీకాంత్‌ సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుడు తల్లి మసరం పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-18T04:52:37+05:30 IST