Abn logo
Apr 11 2021 @ 15:15PM

ఉగాది పండుగకు ఊరికి వెళ్తుండగా ఘోరం

కర్నూలు: తెలంగాణ రాష్ట్రం కోదండాపురం దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పులివెందుల మండలం ఎర్రపల్లకి చెందిన వారిగా గుర్తించారు. మురళీ మోహన్ రెడ్డి (50), సుజాత (48), నేహ (13)గా గుర్తించారు. క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉగాది పండుగకు హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement