Abn logo
Apr 14 2021 @ 09:05AM

చీరాల రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారు బీభత్సం

ప్రకాశం: జిల్లాలోని చీరాల రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బీభత్సం సృష్టించిన కారు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయంతిపేటకు చెందిన వీఆర్వో అశోక్ మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement