Abn logo
Apr 19 2021 @ 14:03PM

పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఇంట్లో పెను విషాదం..

హైదరాబాద్/దుండిగల్‌ : తెల్లారితే పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది. స్నేహితులతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని వస్తానని ముందు రోజు రాత్రి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌ మితిలీనగర్‌కు చెందిన కరణం శ్రీనివాస్‌ కుమార్‌ కుమారుడు కరణం అభినవ్‌(24) ఆదివారం పుట్టిన రోజు. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో స్నేహితులు, బంధువులతో కలిసి ముందుగా వేడుకలు జరుపుకోవడానికి గండిమైసమ్మ సమీపంలోని శ్రీచైతన్య కాలేజీ సమీపంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగిన తర్వాత రాత్రి 1.20 గంటల సమయంలో స్నేహితుడి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తానని, మరో స్నేహితుడు వంశీతో కలిసి వెళ్లాడు. భౌరంపేట్‌ బంగారుమైసమ్మ ఆలయం వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి అభినవ్‌, వంశీలు కింద పడ్డారు. వీరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అభినవ్‌ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement