Abn logo
Aug 2 2021 @ 00:59AM

రహదారి ప్రమాదంలో మహిళ మృతి

కంకిపాడు, ఆగస్టు 1 : మండలంలోని నెప్పల్లి శివారు పుట్టగుడి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రహదారి ప్రమాదంలో ఓ మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  స్ధానికంగా నివసించే పామర్తి కృష్ణవేణి (30)  చిన్న దుకాణంలో పాలతో పాటు టీ అమ్ముతోంది. ఈమె ఎప్పటిలాగే ఆదివారం తెల్లవారు జామున పాల వ్యాను రావడంతో పాలప్యాకెట్లు తీసుకుని దుకాణంలో పెట్టేందుకు వెళుతుండగా అదే సమయంలో వ్యాను పక్క నుంచి ఆకస్మాత్తుగా వెళ్లిన ఏపీ 39 ఎఫ్‌ఎస్‌ 0011 నెంబరు గల కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలతో అక్కడిక క్కడే మృతి చెందింది. వ్యాను డ్రైవరు సమాచారంతో మృతురాలి కుటుంబ సభ్యులు, స్ధానికులు ఘటనా స్థలానికి వచ్చి పోలీసులకు సమాచారం అందజే శారు. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు కారు కోసం గాలిస్తున్నారు. మృతురాలి భర్త సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గారావు తెలిపారు.