Abn logo
Nov 14 2020 @ 06:59AM

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక్కడే మిగిలాడు!

Kaakateeya

హైదరాబాద్ : హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం రాగన్నగూడ గ్రామానికి చెందిన ఎస్‌.చంద్రకళ(42) ఆమె కుమారుడు ప్రదీ్‌పరెడ్డి(19) టైలర్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా గురువారం రాత్రి రాగన్నగూడ చౌరస్తాలోని బీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు. అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా మన్నెగూడ వైపు వెళ్లే టాటా సుఫారి ఢీకొట్టింది. దీంతో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా కారులో ఉన్న మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారకుడైన ఇమాన్యూయేల్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్‌ తెలిపారు. కాగా వారి అంత్యక్రియలు బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అల్మా్‌సగూడలో జరిగాయి.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి వారి మృత దేహాలను సందర్శించి నివాళులర్పించారు.

ఒక్కడే మిగిలాడు.. 

చంద్రకళ భర్త సంరెడ్డి భాస్కర్‌రెడ్డి దాదాపు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తల్లీ, ఇద్దరు కొడుకులు కలిసి ఉంటున్నారు. రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు చిన్న కొడుకు ప్రదీ్‌పరెడ్డి(19) మరణించడంతో, ఇక వారి కుటుంబంలో పెద్ద కొడుకు జగదీ్‌పరెడ్డి(24) ఒక్కడే మిగిలాడు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న జగదీ్‌షరెడ్డి.. ‘నన్ను ఒంటిరిని చేసి వెళ్లిపోయారా?’.. అంటూ రోదించడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.

Advertisement
Advertisement