రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-12-01T06:34:17+05:30 IST

గొడిచెర్ల హైవేపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాన్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
గాయపడిన వ్యాన్‌ డ్రైవర్‌ రవి


నక్కపల్లి, నవంబరు 30 : గొడిచెర్ల హైవేపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాన్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం నుంచి గుంటూరుకు ఇంటి సామగ్రితో వెళుతున్న వ్యాన్‌, ఒడ్డిమెట్ట సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. వ్యాన్‌ ముందు భాగం నుజ్జుకాగా, లారీ డీజిల్‌ ట్యాంక్‌ పగిలిపోయింది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ ఎస్‌.రవి గాయపడ్డాడు. వెంటనే అతనిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించగా,  విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ అప్పన్న కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-12-01T06:34:17+05:30 IST