Advertisement
Advertisement
Abn logo
Advertisement

Nalgonda : మిర్యాలగూడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ- చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. మృతులు నాగేశ్వరరావు (44), జయరావు(42), మల్లికార్జున్(40) గా పోలీసులు గుర్తించారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే.. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement