రియాల్టీ షో చిన్నారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-15T15:43:14+05:30 IST

కన్నడ ఛానెల్‌లో ‘నన్నమ్మ సూపర్‌ స్టార్‌’ రియాల్టీ షోలో రాణిస్తున్న ఆరేళ్ళ చిన్నారి సమన్వి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు జరిపారు. తల్లి అమృతానాయుడుతో కలిసి చిన్నారి ద్విచక్ర వాహ నంపై వెళుతుండగా

రియాల్టీ షో చిన్నారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

బెంగళూరు: కన్నడ ఛానెల్‌లో ‘నన్నమ్మ సూపర్‌ స్టార్‌’ రియాల్టీ షోలో రాణిస్తున్న ఆరేళ్ళ చిన్నారి సమన్వి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు జరిపారు. తల్లి అమృతానాయుడుతో కలిసి చిన్నారి ద్విచక్ర వాహ నంపై వెళుతుండగా కోణనకుంటె క్రాస్‌ వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో గురువారం సాయంత్రం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చిన్నారి సమన్వి అక్కడికక్కడే దుర్మరణం చెందగా నాలుగునెలల గర్భిణి అయిన తల్లి అమృతా ఆసుపత్రిలో చికిత్సలు పొంది డిశ్చార్జి అయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో బన శంకరి స్మశానవాటికలో చిన్నారి అంత్యక్రియలు జరి పారు. కన్నడలో ప్రముఖ హరికథా కళాకారులు గురురాజ్‌ నాయుడు మనవరాలు సమన్వి. చిన్నారి తల్లి అమృతా హరికథా గాయనిగానే కాకుండా బుల్లితెర కళాకారురాలు. అమృతా నాయుడు భర్త రూపేష్‌ నాయుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి కాగా వీరి తొలి సంతానం అనారోగ్యంతో మృతి చెందగా ప్రస్తుతం కుమార్తె సమన్వి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తల్లీ కుమార్తెలు నమ్మమ్మ సూపర్‌స్టార్‌ రియాల్టీషోలో పాల్గొంటుండేవారు. వీరి జోడికి ఆదరణ లభించింది. అమృతా నాయుడు గర్భిణి కావడంతో షోకు దూరం ఉండాల్సి వచ్చింది. చిన్నారి పట్ల రాష్ట్రమంతటా అభిమానులు పెరుగుతున్న తరుణంలోనే ప్రమాద రూపంలో చిన్నారి సమన్వి కన్నుమూశారు. 


Updated Date - 2022-01-15T15:43:14+05:30 IST