లారీ ఢీకొని విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-11-28T05:48:57+05:30 IST

మోటార్‌ సైకిల్‌ పై వస్తున్న విద్యార్థిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పామర్రు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

లారీ ఢీకొని విద్యార్థి మృతి

కె.గంగవరం, నవంబరు27: మోటార్‌ సైకిల్‌ పై వస్తున్న విద్యార్థిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పామర్రు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దంగేరు గ్రామానికి చెందిన మాచవరపు ముకేష్‌ విజయరాఘవన్‌(15) శనివారం మోటార్‌సైకిల్‌పై శివాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాను చదువుతున్న ఉన్నత పాఠశాల వద్ద వరికోత మిషన్‌ను తరలిస్తున్న లారీ ఢీ కొట్టింది. రాఘవన్‌ తలపై నుంచి లారీ చక్రాలు వెళ్ళాయి. రాఘవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు లారీ నడుపుతున్న వ్యక్తి కోత మిషన్‌కు కరెంటు తీగలు తగులుతాయనే ఉద్దేశంతో పక్కకు తిప్పాడని అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో ఉన్న రాఘవన్‌ను చూసి స్థానికులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. రాఘవన్‌ తండ్రి ప్రసాద్‌ ఈ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గాను, తల్లి పార్వతీప్రసూన కూనిమిల్లిపాడు ప్రాఽథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రాఘవన్‌ చెల్లి విజయలక్ష్మి ఆరో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. దంగేరులో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌.ఐ. కె.చిరంజీవి చెప్పారు.

Updated Date - 2021-11-28T05:48:57+05:30 IST