Abn logo
Sep 10 2021 @ 23:51PM

అతివేగం వల్లే రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: ‘మెగా’ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  అతివేగం వల్లే ఈ రోడ్డు ప్రమాదం  జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేబుల్ బ్రిడ్డి దగ్గర స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తుంది. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారు. ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేసారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో  సాయిధరమ్‌ తేజ్‌కు చికిత్సను అందిస్తున్నారు.