Abn logo
Oct 27 2021 @ 22:10PM

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

గాయపడిన వ్యక్తికి చికిత్స చేస్తున్న 108 సిబ్బంది

మనుబోలు, అక్టోబరు 27: మండలంలోని బద్దెవోలు మార్గంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరుకు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. గూడూరుకు చెందిన ఆక్వా రైతు మనుబోలు రవీంద్ర (45) మోటారుబైక్‌పై మండల పరిధిలోని   బద్దెవోలులో ఉన్న బంధువుల ఇంటికి వెళుతుండగా.. బద్దెవోలు మార్గంలో సంగమేశ్వర దేవస్థానం సమీపంలో ఉన్న మలుపు వద్ద గుర్తుతెలియని కారు ఢీకొనడంతో  బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎన్‌టీ ఉపేంద్ర, ఫైలెట్‌ సురేష్‌ ప్రమాద స్థలికి చేరుకుని చెట్లలో పడి ఉన్న రవీంద్రను బయటకు తీసి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.