Abn logo
Sep 25 2021 @ 11:58AM

విషాదం.. ప్రమాణ స్వీకారానికి వచ్చి పరలోకానికి...

             - రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి 


నందవరం(కర్నూలు): నందవరం ఎంపీపీ లక్ష్మీదేవమ్మ ప్రమాణ స్వీకారానికి వచ్చి తిరిగి వెళుతున్న ఇద్దరు కార్యకర్తలు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కనకవీడుకు చెందిన నరసింహులు, గోపాల్‌ ఎంపీపీ ప్రమాణ స్వీకారం తర్వాత నందవరం నుంచి కనకవీడుకు బైకుపై బయలుదేరారు. నాగలదిన్నెకు చెందిన నిసార్‌ అహ్మద్‌ నాగలదిన్నె నుంచి బైకుపై అతి వేగంగా వస్తూ వీరి బైకును ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసింహులు అప్పటికే మృతిచెందినట్లు డాక్టరు తెలిపారు. గోపాల్‌, నిసార్‌ అహ్మద్‌ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.