AP: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు..

ABN , First Publish Date - 2021-11-22T12:56:57+05:30 IST

పిఠాపురం బైపా్‌సరోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదం నుంచి కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు పాదగయ సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పింది. విద్యుత్‌

AP: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు..

తూర్పుగోదావరి/పిఠాపురం: పిఠాపురం బైపా్‌సరోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదం నుంచి కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు పాదగయ సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పింది. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఒరిగిపోయింది. హైటెన్షన్‌ వైర్లు ఉన్న స్తంభం కావడంతో అందరు ఆందోళనకు గురయ్యారు. తీగలు తెగకపోవడంతో కారులోని ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షి తంగా బయటపడ్డారు. కారు దెబ్బతినగా అందులోని వారు వేరొక కారులో వెళ్లిపోయారు.

Updated Date - 2021-11-22T12:56:57+05:30 IST