Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీరియల్ నటి లహరి కారు బీభత్సం.. తన భర్త వచ్చి మాట్లాడతాడతారంటూ..

హైదరాబాద్: కొంచెం సెలబ్రెటి హోదా వస్తే చాలు.. రెచ్చి పోతున్నారు.. ఇతరుల ప్రాణాలమీదకు తెస్తున్నారు. తాజాగా సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది. గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.


ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా కారు ఢీ కొట్టింది. కారులోంచి దిగాలంటూ లహరిని పోలీసులు కోరారు. కిందికి దిగలేదు. దాంతో పోలీసులు ఆమెను కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం సేవించలేదని తేలింది. మరోవైపు గాయపడ్డ వ్యక్తి తరఫున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో… లహరిని ఇంటికి పంపించేశారు.

Advertisement
Advertisement