Picnic పూర్తి చేసుకుని కారు దగ్గరకు వస్తే... అద్దం మీద కనిపించింది చూసి అదిరిపోయారు...

ABN , First Publish Date - 2021-12-02T20:19:17+05:30 IST

కుటుంబం మొత్తం ఆనందంగా పిక్‌నిక్‌కి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లాలని కారు దగ్గరకు వచ్చిన వారు.. అద్దం మీద అనుకోని అతిథిని చూసి అదిరిపోయారు

Picnic పూర్తి చేసుకుని కారు దగ్గరకు వస్తే... అద్దం మీద కనిపించింది చూసి అదిరిపోయారు...

కుటుంబం మొత్తం ఆనందంగా పిక్‌నిక్‌కి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లాలని కారు దగ్గరకు వచ్చిన వారు.. అద్దం మీద అనుకోని అతిథిని చూసి అదిరిపోయారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్నేక్ క్యాచర్ జోష్ క్యాజిల్ ఇన్‌స్టాలో పంచుకున్నారు. సదరు కుటుంబం కారు అద్దాన్ని కొద్దిగా తెరిచి ఉంచి తీర ప్రాంతంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లింది. కుటుంబమంతా కలిసి విహారయాత్రను ఎంజాయ్ చేసిన మీదట ఇంటికి వెళ్లేందుకు కారు దగ్గరకు తిరిగి వచ్చింది. 


సదరు కుటుంబం తిరిగొచ్చే సమయానికి ఒక కొండచిలువ కారులోని అద్దానికి చుట్టుకుని ఉంది. దాన్ని చూసి షాకైన కుటుంబం వెంటనే జోష్ క్యాజిల్‌కు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు వచ్చిన జోష్.. కొండచిలువను బంధించాడు. ఇలాంటివి.. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయని తెలిపాడు. 

‘‘ఆస్ట్రేలియాలో మాత్రమే మీరు అద్దం చుట్టూ చుట్టబడిన తీరప్రాంత కార్పెట్ కొండచిలువను చూడగలుగుతారు. ఓ కుటుంబం పిక్‌నిక్‌కి వెళుతూ తమ కారును కాస్త చల్లగా ఉంచేందుకు అద్దాన్ని కాస్త కిందకు దించి వెళ్లారు. తిరిగి వచ్చి చూసి ఆశ్యర్యపోయారు’’ అని జోష్ క్యాజిల్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2021-12-02T20:19:17+05:30 IST