Abn logo
Sep 28 2021 @ 13:08PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంట పట్టణంలో బైక్‌ అదుపు తప్పి మరొకరిని ఢీకొట్టిన సంఘటనలో బైక్‌ నడుపుతున్న యువకుడితోపాటు మరో వ్యక్తి మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మున్సిపల్‌ పరిధిలోని పద్మశాలి వీధికి చెందిన బత్తుల శ్రీనివాస్‌ తన స్నేహితుడు గుడేరి ఈశ్వర్‌లు ద్విచక్రవాహనంపై గణేష్‌నగర్‌ వైపు వస్తున్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సుమ్రత్‌ మహ త్కర్‌ మస్కర్‌ అనే తాపీ కూలీ పనులు ముగించుకొని తోటి కూలీలతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ద్విచక్ర వాహానం నడుపుతున్న శ్రీనివాస్‌ అదుపు తప్పి వెనుకాల నుంచి తాపీ కూలీని ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  ఇద్దరిని వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాతపడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ిసీఐ కె రామ్‌చందర్‌రావు తెలిపారు. 

క్రైమ్ మరిన్ని...