పండుగ..విషాదం

ABN , First Publish Date - 2022-01-17T06:33:35+05:30 IST

పండుగ చివరిలో జిల్లాలో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా 19 మందికి గాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది..

పండుగ..విషాదం
భీమడోలులో బస్‌ ప్రమాదం

పండుగ చివరిలో జిల్లాలో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా 19 మందికి గాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది..

మద్యం మత్తులో.. కత్తులతో దాడి

ఒకరి మృతి..ఇద్దరికి గాయాలు

చాగల్లు, జనవరి 16: మద్యం మత్తులో వివాదానికి దిగి కత్తులతో దాడిచేసిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఎస్సై వెంకట రమణ తెలిపిన వివరాల ప్రకారం చాగల్లుకు చెందిన ఎన్‌.ఫణికుమార్‌ అతని స్నేహితులు మాచవరపు సురేష్‌ (29) వీర్ల రామకృష్ణలతో కలిసి శనివారం రాత్రి కారులో ధవళేశ్వరంలో సినిమా చూసేందుకు వెళుతున్నారు. గ్రామశివారు నందమూరు వంతెన సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ రోడ్డుకు అడ్డంగా బైక్‌ పెట్టారు. తీయమని కోరగా ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో మాచవరపు సురేష్‌ (29), వీర్ల రామకృష్ణ కత్తిపోట్లుకు గురయ్యారు. ఫణికుమార్‌ రోడ్డుపక్కన గోతిలో పడిపోయాడు. దాడిచేసిన యువకులు పారి పోయారు. క్షతగాత్రులను 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సురేష్‌ మార్గమధ్యలోనే మృతి చెందాడు. 


చెట్టును ఢీకొన్న మోటార్‌ సైకిల్‌

ఒకరి మృతి..మరొకరికి గాయాలు

కొవ్వూరు  : చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందినట్లు కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పేట గణే్‌ష్‌ (24), గంగుపల్లి అయ్యప్పలు ఆదివారం రాత్రి స్టేట్‌ బ్యాంకు సమీ పంలో బైక్‌తో చెట్టును ఢీకొట్టారు. వీరిని ఆసుపత్రికి తరలించగా గణేష్‌ మృతి చెందాడు. 


రైలు నుంచి జారిపడి మహిళ మృతి

ఏలూరు, క్రైం/భీమడోలు, జనవరి 16 : గుర్తు తెలియని మహిళ భీమ డోలులో రైలు ఎక్కుతూ ప్రమదావశాత్తు పడి మృతి చెం దింది. 35–40 ఏళ వయసు కలిగి, గులాబీ నలుపు రంగు టాప్‌, గులాబీ రంగు లెగ్గిన్‌ ధరించి ఉంది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభు త్వాసుపత్రికి తరలిం చారు.  సమాచారం తెలిస్తే ఏలూరు రైల్వేపోలీసు నెంబరు 80740 55378 కు సమాచారం అందించాలని కోరారు.


కాల్వలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

కొయ్యలగూడెం :  మండలంలోని రాజవరం ఎర్రకాల్వలో ఆదివారం స్నానం చేయడానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్టు ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ తెలిపారు. జంగా రెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు ఎర్ర కాల్వలో స్నానం చేయడానికి కాల్వలోకి దిగి జారిపోయారు. జట్టి ముఖేష్‌ (23), జట్టి గణేష్‌ (21) నీటిలో మునిగి చనిపోయారు. మిగిలిన నలు గురు బయటపడ్డారు. మృతుల్లో ముఖేష్‌ డిగ్రీ పూర్తిచేయగా, గణేష్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.  


 బైక్‌ ప్రమాదాల్లో ఇద్దరి మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం సబ్‌స్టేషన్‌ వద్ద షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న తాడేపల్లి సుబ్రహ్మణ్యం (26) ఈనెల 15న తన భార్యను నల్ల జర్లలోని తన బంధువుల ఇంటి వద్ద దింపి తిరిగి వస్తుండగా వీరంపాలెం వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వచ్చేసరికి మరో మోటారుసైక్లిస్ట్‌ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారిం చారు. ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లికి చెందిన కొక్కిరపాటి శ్రీనివాసరావు (41), భీమడోలు భాస్కరరావు, మానేపల్లి సుబ్బారావులు మోటారు సైకిల్‌పై వెంకట్రామన్న గూడెం వెళ్లి పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా వెంకట్రామన్నగూడెం వడ్డి చెరువు వద్ద బండి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు తలకు తీవ్రగా యమై అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కరరావుకు గాయాలయ్యాయి. 


 మోటార్‌ సైకిల్‌ను ఢీకొన్న కారు..ముగ్గురికి గాయాలు

నిడదవోలు : రాజమండ్రి నుంచి మునిపల్లి వైపు వెళుతున్న కారు, మునిపల్లి వైపు నుంచినిడదవోలు వైపు ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వస్తుండగా  ఢీకొట్టింది. స్థానికుల సహాయంతో ముగ్గురు యువకులను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు దేవ రపల్లి మండలం పల్లంట్లకి చెందిన వారిగా గుర్తించారు. 


బుల్లెట్‌ను ఢీకొన్న ఆటో : ఇద్దరికి గాయాలు

కొవ్వూరు :ఽ  తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం గ్రామానికి చెందిన కటకం మల్లేష్‌, పసుపులేటి సాయి బుల్లెట్‌పై ఆదివారం రాత్రి కొవ్వూరు బయలుదేరారు. రోడ్డు కం రైలు బ్రిడ్జి 137వ స్తంభం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్ట డంతో ఇద్దరికి గాయాలయ్యాయి.  


లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు..

పది మందికి గాయాలు

భీమడోలు :  హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్తున్న  ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు శనివరం భీమడోలు జంక్షన్‌లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో బస్సు కండక్టర్‌ అంకం బుజ్జితో పాటు మరో తొమ్మిది మందికి స్వల్పగాయాలయ్యాయి.    


 ఏలూరులో వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ఏలూరుక్రైం : ఏలూరు–చింతలపూడి రోడ్డులోని వంగూరు అడ్డ రోడ్‌ వద్ద ఒక వృద్ధుడు నడిచి వెళ్తుంటే గుర్తు తెలియని వాహనం శనివారం రాత్రి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లుంగీ, చొక్కా ధరించి ఉన్నాడు. 

Updated Date - 2022-01-17T06:33:35+05:30 IST