మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

ABN , First Publish Date - 2021-01-21T06:24:54+05:30 IST

మానవ తప్పిదాలవల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డీటీసీ బసిరెడ్డి తెలిపారు.

మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న డీటీసీ బసిరెడ్డి

డీటీసీ బసిరెడ్డి 


చిత్తూరు సిటీ, జనవరి 20: మానవ తప్పిదాలవల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు రవాణాశాఖ, పోలీసు సిబ్బంది రహదారి భద్రత నినాదాలు చేస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ.. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు 24 శాతం మరణిస్తున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 2020లో జరిగిన 1517 రోడ్డు ప్రమాదాల్లో 647మంది మరణించారన్నారు. ఇందులో 529 ద్విచక్రవాహనాల ప్రమాదాలు జరగ్గా.. 222 మంది మరణించారన్నారు. వీరిలో ఎక్కువమంది హెల్మెట్‌ లేకపోవడం వల్లే చనిపోయినట్లు పేర్కొన్నారు. ఎంవీఐలు శేఖర్‌రావు, క్రాంతికుమార్‌, మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:24:54+05:30 IST