దేశంలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ABN , First Publish Date - 2020-09-18T20:17:13+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తితోపాటు లాక్ డౌన్ విధించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య గతంలో కంటే 35 శాతం తగ్గిందని వెల్లడైంది....

దేశంలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తితోపాటు లాక్ డౌన్ విధించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య గతంలో కంటే 35 శాతం తగ్గిందని వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్య 1,60,000లుగా నమోదైంది. గడచిన ఆరేళ్లలో కంటే కొవిడ్ సంక్షోభం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య 35 శాతం తగ్గిందని తేలింది. రోడ్డు ప్రమాదాల గురించి పార్లమెంటుకు కేంద్రప్రభుత్వం సమర్పించిన తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. 


2014 నుంచి 2019 వరకు 2,48,000 రోడ్డుప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది తగ్గాయని కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కర్ణాటక, ఢిల్లీలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 45 శాతానికి పైగా తగ్గింది. దేశంలో 68 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వల్ల వాహనాల రాకపోకలు తగ్గి ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. 

Updated Date - 2020-09-18T20:17:13+05:30 IST