మూడు నెలల్లో... 193 మంది మృతి

ABN , First Publish Date - 2021-04-14T18:02:52+05:30 IST

కొవిడ్‌ వైర్‌సతో పాటు బెంగళూరు నగరంలో గత మూడు నెలలుగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది

మూడు నెలల్లో... 193 మంది మృతి

- పెరిగిన రోడ్డు ప్రమాదాలు 


బెంగళూరు : కొవిడ్‌ వైర్‌సతో పాటు బెంగళూరు నగరంలో గత మూడు నెలలుగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు నెలల వ్యవధిలో నగర పరిధిలో 941 రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 193 మంది బలయ్యారని, 830 మంది గాయపడ్డారని ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రవికాంతేగౌడ తెలిపారు. నగరంలో ఆయన ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘన వంటివి ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్నవారేనని ఆయన వెల్లడించారు. బెంగళూరు నగరంలో మొత్తం 82.53 లక్షల వాహనాలు ఉండగా అందులో 57.30 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలే ఉన్నాయన్నారు. ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనకు సంబంధించి గత 3 నెలల్లో 29.97 లక్షల కేసులను దాఖలు చేసి రూ.46.15 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-04-14T18:02:52+05:30 IST