పోలీసుల అండతో తిరిగి రోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2022-01-28T04:50:18+05:30 IST

పోలీసుల అండతో వక్కిలేరు వంకను ఆక్రమించి పోలీసుల అండతో పంచాయతీ రాజ్‌ మైదుకూరు డీఈఈ మల్లెశ్వరెడ్డి రోడ్డు నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న కొందరు రైతులు పనులు అడ్డగించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పో యింది. వివరాల్లోకెళితే....

పోలీసుల అండతో తిరిగి రోడ్డు  నిర్మాణం
పోలీసుల సాయంతో పనులు చేస్తున్న దృశ్యం

మైదుకూరు, జనవరి 27: పోలీసుల అండతో వక్కిలేరు వంకను ఆక్రమించి పోలీసుల అండతో పంచాయతీ రాజ్‌ మైదుకూరు డీఈఈ మల్లెశ్వరెడ్డి రోడ్డు నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న కొందరు రైతులు పనులు అడ్డగించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పో యింది. వివరాల్లోకెళితే....

 వంకలు, వాగులు, నదులు, వాటి పరంబోకు స్థలాల ను ఎవరూ ఆక్రమించరాదంటూ 2002లో సుప్రీంకోర్ట్టు తీర్పు ఇచ్చింది. అయితే పర్యవేక్షించే అధికారే సోమ యాజుపల్లె వక్కిలేరు వంకను ఆక్రమించి రోడ్డు వే స్తుండగా కొందరు గ్రామస్తులు అడ్డుకోవడంతో వెను తిరిగిన విషయంపై జనవరి 21న ఆంధ్రజ్యోతిలో ప్రధా న కథనం ప్రచురితమైంది. అయితే గురువారం పంచాయతీరాజ్‌ డీఈఈ, మండల వైసీపీ నేతలు, అనుచరులు, ఎస్‌ఐ రమణ దాదాపు 10మంది పోలీసులతో వక్కిలేరు వంక వద్ద రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. కొందరు రైతులు పనులు అడ్డగించే యత్నించినా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ విషయంపై కొందరు రైతులు తహసీల్దారు ప్రేమంతకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఆంధ్రజ్యోతికి వివరణ ఇస్తూ రహదారి వేస్తున్నట్లు కొందరు రైతులు ఫిర్యాదు చేశారని, అయితే అవతలివారుకూడా తమ పొలాలకు రహదారి లేదని. శ్రమదానం కింద వంక వారగా రహ దారి నిర్మించుకుంటామని అనుమతి ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారని తెలిపారు. ఈ అంశంపై తామూ, నీటిపారుద ల శాఖతో కలసి వాగు విస్తీర్ణం హద్దులు చూపెడతామని తెలిపారు. ఇందులో మరో వర్గం వారు అడ్డుకుంటున్నారని, తమకు బందోబస్తు కావాలని డీఈఈ కోరగా తాము బందోబస్తుకు పంపినట్లు అర్బన్‌ సీఐ చలపతి పేర్కొన్నారు. 

పుట్టా ఫిర్యాదుతో పరిశీలించిన పంచాయతీరాజ్‌ ఈఈ.... 

వంక, పరంబోకు స్థలాన్ని ఆక్రమించి రహదారి వేస్తుడడంతో కొందరు రైతులు టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ దృష్టికి తీసుకుపోయిరు. దీంతో ఆయన కలెక్టర్‌, పంచాయతీరాజ్‌, నీటి పారుదలశాఖ అధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. జిల్లా పంచాయతీరాజ్‌ ఈఈ శ్యామ్‌సుందర్‌రాజు రహదారి పనులను పరిశీలించి, అక్కడ చేస్తున్న  పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. తహసీల్దారు, ఇరిగేషన్‌ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-01-28T04:50:18+05:30 IST