దడ పుట్టిస్తున్న గ్రామీణ రోడ్లు

ABN , First Publish Date - 2021-06-22T06:36:43+05:30 IST

మండలంలోని పలు గ్రామాల రోడ్లు రోతరోతగా మారాయి. మొ త్తం 44 గ్రామాలకుగాను సగం ఊళ్లకు సరైన రహదారులు లేవు.

దడ పుట్టిస్తున్న గ్రామీణ రోడ్లు
ముడివేముల రోడ్డులో గుంతల్లో నిలిచిన నీరు

త్రిపురాంతకం మండలంలో 

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

ఏళ్ల తరబడి మరమ్మతులు 

నోచుకోని రహదారులు

త్రిపురాంతకం, జూన్‌ 21 : మండలంలోని పలు గ్రామాల రోడ్లు రోతరోతగా మారాయి. మొ త్తం 44 గ్రామాలకుగాను సగం ఊళ్లకు సరైన రహదారులు లేవు. కొన్ని చోట్ల 20 ఏళ్ల క్రితం వేసిన తారు రోడ్లు దెబ్బతిని గోతులమయంగా త యారయ్యాయి. ముఖ్యంగా వర్షం వస్తే ప్రయా ణం నరకప్రాయంగా మారుతోందని ప్రయాణికు లు వాపోతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాలలో ఆర్థిక సంఘం, మండల, ఎమ్మెల్యే, ఎంపీ నిధులు కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలలో అంతర్గత సిమెంటు రోడ్లు వేస్తున్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు తారు రోడ్లు నిర్మించటం లేదు. డీవీఎన్‌ కాలనీకి తారు రోడ్డును, కంకణాలపల్లి నుంచి గాంధీనగర్‌ గ్రామానికి ఇటీవల తారు వేశారు. రెండేళ్ల క్రితం మంజూరైన సోమేపల్లి, గణపవరం, తండా రోడ్లు పనులు ఇటీవలే ప్రారంభించగా ఇంకా సాగుతూనే ఉన్నాయి. పలు గ్రామాలకు పూర్వం నిర్మించిన మట్టి రోడ్లు అభివృద్ధికి నో చుకోకపోగా తారురోడ్లలో కంకర రాళ్లు మొనతేలి నడిచేందుకు కూడా వీలు లేదని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు.  

ఛిద్రమైన రహదారులు

వెల్లంపల్లి సమీపం లోని హైవే రోడ్డు నుంచి విశ్వనాథపురం గ్రామానికి ఉన్న 3 కిలోమీటర్ల రోడ్డు పూర్తి గా ఛిద్రమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మధ్యలో ఉన్న చప్టా కూడా గతంలో విడుదలైన సాగర్‌ జలాల ఉధృ తికి కొట్టుకుపోయింది. గ్రామానికి బస్సు లు లేకపోగా గతంలో తిరిగే ఆటోలు కూ డా తిరగడంలేదు. దీంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక మండల కేంద్రం సమీపంలోని టి.చెర్లోపల్లికి రెండువైపులా రోడ్డు ఉండగా రెండూ నరకదారులే. త్రిపురాంతకం నుంచి కంకణాలపల్లి, ఒడ్డుపాలెం, పాపన్నపా లెం, పాతముడివేముల, కొత్తముడివేముల గ్రా మాలకు వెళ్లే దారి తారు లేచి, పూర్తిగా గుంతలమయంగా తయారై మరీ అధ్వానంగా మారింది. ఇక సోమేపల్లి నుంచి గాంధీనగర్‌, దూపాడు నుం చి హసానాపురం, మిరియంపల్లి నుంచి ఒడ్డు పాలెం, త్రిపురాంతకం నుంచి నాసరరెడ్డినగర్‌ గ్రా మాల రోడ్ల పరిస్థితి మరీ దయనీయం.


Updated Date - 2021-06-22T06:36:43+05:30 IST