నిలిచిన రోడ్డు పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-01T05:32:32+05:30 IST

మండల కేంద్రంలో నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయడంతో పాటు, అంబేడ్కర్‌ విగ్రహం నుంచి హైదరాబాద్‌ రోడ్డులో కిలోమీటర్‌ మేర సీసీ రోడ్డు నిర్మించాలని కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ర్యాలీ తీసి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు.

నిలిచిన రోడ్డు పనులు చేపట్టాలి
కొండమల్లేపల్లిలో రోడ్డు పనులు చేపట్టాలని నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

కొండమల్లేపల్లి, నవంబరు 30 : మండల కేంద్రంలో నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయడంతో పాటు, అంబేడ్కర్‌ విగ్రహం నుంచి హైదరాబాద్‌ రోడ్డులో కిలోమీటర్‌ మేర సీసీ రోడ్డు నిర్మించాలని కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ర్యాలీ తీసి అంబేడ్కర్‌  విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఉటుకూరి వేమన్‌రెడ్డి, సర్పంచ్‌లు మాట్లాడుతూ కిలోమీటరు మేర సీసీరోడ్డు నిర్మాణానికి రూ.4.80కోట్లు మంజూరై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి చేయలేదన్నారు. సీసీ రోడ్డు ని ర్మాణానికి మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌  పనులు ప్రారంభించినా గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయన్నారు. గతంలో ఉన్న రోడ్డును తవ్వడం తో దుమ్ము, ధూళి లేచి ప్రజలు, చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాలు వస్తే గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డుపై బురద ఏర్పడి పాదాచారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్యక్ష్యమే రోడ్డు నిర్మాణం ఆలస్యానికి కారణమన్నారు. ఆర్‌అండ్‌బీ డీఈకి ఫోన్‌లో సమస్యను వివరించగా డిసెంబరు 3న పనులు చేపడుతామని తెల పడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రవినాయక్‌, గడ్డం శ్రీరాములు, లచ్చిరాం, మంగ్యానాయక్‌, రాకేష్‌, అందుగుల ముత్యాలు, బొడ్డుపల్లి సైదులు, లింగయ్య, వస్కుల బక్కలయ్య, కైసర్‌ఖాన్‌, రమావత్‌ రాజు, సుధాకర్‌, ఐతేపాక సుమన్‌, వస్కుల రమేష్‌, కృష్ణ, వరికుప్పల శ్రీను, బక్కలయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:32:32+05:30 IST