Ayodhya: రామజన్మభూమికి వెళ్లే రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు

ABN , First Publish Date - 2021-08-23T16:18:26+05:30 IST

అయోధ్య నగరంలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళ్యాణ్ సింగ్ పేరు పెట్టనున్నట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సోమవారం ప్రకటించారు....

Ayodhya: రామజన్మభూమికి వెళ్లే రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు

లక్నో (ఉత్తరప్రదేశ్): అయోధ్య నగరంలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళ్యాణ్ సింగ్ పేరు పెట్టనున్నట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సోమవారం ప్రకటించారు. అయోధ్యతోపాటు లక్నో, ప్రయాగరాజ్, బులంద్ షహర్, అలీఘడ్ నగరాల్లో ఒక్కో రహదారికి కళ్యాణ్ సింగ్ పేరు పెట్టనున్నట్లు మౌర్యా వెల్లడించారు.బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయనకు నివాళిగా పలు రోడ్లకు ఆయన పేరు పెడతామని డిప్యూటీ సీఎం మౌర్యా చెప్పారు. 1991 జూన్ నుంచి 1992 డిసెంబరు వరకు, 1997 సెప్టెంబరు నుంచి 1999 నవంబరు వరకు రెండు సార్లు యూపీ సీఎంగా, రాజస్థాన్ గవర్నరుగా కళ్యాణ్ సింగ్ పనిచేశారు. 


Updated Date - 2021-08-23T16:18:26+05:30 IST